నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఈ నెల 19న మెగా జాబ్ మేళా..
వెస్ట్ గోదావరి జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు డిగ్రీ /పిజి పాస్ అయి 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసుండి ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఎలాంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ అవకాశం లభిస్తోంది. ఈనెల 19న తణుకులోని ఎస్ ఎం వి ఎం పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి, ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
ఈ జాబ్ మేళాలో దివీస్ లాబొరేటరీస్ ప్రముఖ కంపెనీ తమ సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం డిగ్రీ /పిజి పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు. 19-07-2025వ తేదీ ఉదయం 09:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ ఉద్యోగమేళా జరగనుంది.ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి ఉద్యోగి అర్హతను బట్టి జీతం 18 వేల రూపాయల నుంచి 21 వేల రూపాయల వరకు ఉంటుంది.