ఫ్రెషర్స్‌కు టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు....
ఫ్రెషర్స్‌కు టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు….
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) శుభవార్త.
ఈ 2025 సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 40 వేల మంది ఫ్రెస్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. కొత్తగా 40 వేల ఉద్యోగాను భర్తీ చేస్తున్నట్లు టీసీఎస్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఫ్రెషర్లకే అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. కాగా, ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
రానున్న కాలంలో ఐటీ విభాగంలో ఉద్యోగావకాశాలు పెరిగనున్నాయని టీసీఎస్ కూడా మంచి వృద్ధిని సాధించే దిశలో సాగుతుందన్నారు. AI ఆధారిత సంస్థగా తనను తాను నిలబెట్టుకోవడం కోసం నైపుణ్యాభివృద్ధిపై తన దృష్టిని కొనసాగిస్తోంది. TCS అభివృద్ధి చెందుతున్న ఐటీ సేవల ల్యాండ్ స్కేప్‌లో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకుంది.
టీసీఎస్‌లో ఉద్యోగం పొందాలంటే కేవలం కోడింగ్ నైపుణ్యాలు మాత్రమే కాకుండా.. తగిన విద్యార్హతలు కూడా ఉండాలని తెలియచేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు ఉన్న అ్యర్థులను ఈవో నుంచి ఈ3 స్థాయిలో రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉంటే టీసీఎస్‌లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవండి మరి.
మరిన్ని వివరాలకు: https://www.tcs.com/careers/india