నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. వేల మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాల్లో పాల్గొని ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు.
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం వారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐటీడీఏ పిఓ చిత్రా మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ నెల 28న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు.